చేతి రాతతో ఇచ్చే విధానానికి ఇంటర్ బోర్డు స్వస్తి
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఇంటర్ హిందీ, మరాఠి మీడియం విద్యార్థుల కోసం ఈసారి నుంచి ప్రశ్నపత్రాలను ప్రచురించి ఇవ్వనున్నారు. ఈ మీడియంలో ఇంటర్ వార్షిక పరీక్షలు రాసేవారు రాష్ట్రంలో చాలా తక్కువ మందే ఉంటారు. దీంతో వీరికి కొంత కాలం గా అందరిలాగా ప్రశ్నపత్రాలను ప్రచురించి ఇచ్చేవారు కాదు. చేతితో రాసిన ప్రశ్నపత్రాలనే ఇస్తూ వస్తున్నారు.
దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ ఏడాది మార్చిలో నిర్వ హించే ఇంటర్ వార్షిక పరీక్షల్లో ప్రిం టెడ్ ప్రశ్నపత్రాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో హిందీ, మరాఠి మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థులు మొత్తం 250లోపే ఉంటారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నారు.