- మహేశ్వర మెడికల్ కాలేజీ అప్పీల్ తిరస్కరణ చెల్లదు
- నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించారంటూ మహేశ్వర మెడికల్ కాలేజ్ అను మతుల రద్దు వ్యవహారంలో కేంద్ర ఉత్తర్వు లు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరే కంగా ఉన్నాయని హైకోర్టు తేల్చింది. నిర్ణ యం తీసుకునేముందు కాలేజీ వాదనలు కూడా వినాలని సూచించింది. పీజీ కోర్సుల కేటాయింపు రద్దును సమర్థిస్తూ కేంద్ర ఉత్తర్వుల ను సవాలు చేస్తూ మహేశ్వర మెడికల్ కాలే జ్ అండ్ హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నంద మంగ ళవారం విచారించారు. సీనియర్ లాయర్ ఆర్‌ఎన్ హేమేంద్రనాథ్ వాదిస్తూ.. 2021 22 ఏడాది 12 పీజీ మెడికల్ కోర్సులకు ఎన్‌ఎం సీ అనుమతి లభించిందని, ఒక్కో కోర్సుకు రూ.85 లక్షలు చొప్పున మహేశ్వర కాలేజీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించిందని చెప్పారు.
ఆ గ్యారెంటీలు నకిలీవని తేలడం తో అడ్మిషన్లను నిలిపివేయాలని ఎన్‌ఎంసీ చెప్పిందన్నారు. అప్పటికే అడ్మిషన్లు జరిగినందున విద్యార్థులను మరో కాలేజీకి బదిలీ చేయాలని కాళోజీ యూనివర్శిటీని ఆదేశించిందని వివరించారు. నకిలీ బ్యాంకు గ్యారెం టీలు సమర్పించిన ఏజెంట్‌పై క్రిమినల్ కేసునమోదైందని, తిరిగి బ్యాంకు గ్యారెంటీలను సమర్పించినట్టు వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌తో సంబంధం లేకుండా ఎన్‌ఎంసీ ఉత్తర్వులను సమర్థిస్తూ కేంద్రం జారీచేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. గతంలోనే దీనిపై హైకోర్టుకు వస్తే తమ అభ్యర్థను తిరిగి పరిశీలన చేయాలని సూచించిందని, అయినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. ఎన్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిసూ ఎన్‌ఎంసీతో కాలేజీ మోసపూరితంగా వ్యవహరిం చిందని చెప్పారు. నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినందువల్ల నోటీసులు అవసరంలేదని పేర్కొన్నారు. కాలేజీ వాదనలు కూడా విని తగిన కారణాలతో ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
నకిలీ విత్తన విక్రయదారులపై చర్యలు ఏవీ?
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): నకిలీ విత్తన విక్రయదారుల నుంచి రైతులను కాపాడేందుకు ఏం చర్యలు తీసుకున్నది వివరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రైతుల స్థితిగతులను పట్టించుకోని వాణిజ్య విత్తన కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వినతి మేరకు ఈ కేసు విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నకిలీ విత్త నాలు అమ్మే తయారీదారులు/కంపెనీలపై చర్యలకు సంబంధించి 2016 లో ఎమ్మెల్యేగా ఉండగా ఎ రేవంత్‌రెడ్డి(ప్రస్తుత సీఎం) దాఖలు చేసిన పిల్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకం టి డివిజన్ బెంచ్ విచారించింది. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కల్పించుకుని విచారణను నాలుగు వారాలకు వాయిదా వేయాలని కోరారు. అందుకు హైకో ర్టు అనుమతించింది. అప్పటి పిల్ ఇప్పటికి రెండుసార్లు మాత్రమే విచారణకు వచ్చింది.
యాదాద్రి కలెక్టర్‌కు కోర్టు ధిక్కార నోటీసులు
- ఆర్డీవో, ఎంపీడీవో, ఎమ్మార్వోలకు కూడా..
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): భూపరిహారం విషయంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో యాదాద్రి కలెక్టర్, భువనగిరి ఆర్డీవో, తుర్కపల్లి ఎంపీడీవో, ఎమ్మార్వోకు హైకో ర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. ఆగ స్టు 5న జరిగే విచారణకు వీరందరు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో, శిక్ష ఎందుకు విధించరాదో వివరణ ఇవ్వాలని మంగళవారం జస్టిస్ బీ విజయసేనారెడ్డి ఆదేశిం చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపల్లిలో వాటర్ ట్యాంక్, స్కూల్, బస్టాండ్ల కోసం సేకరించిన భూమికి మార్కెట్ ధర మేరకు పిటి షనర్‌కు పరిహారం చెల్లించాలని 2022 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదంటూ రహీము ద్దీన్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
౮౫ ఏండ్ల వృద్ధుడైన పిటిషనర్‌కు మార్కెట్ రేటు ప్రకారం పరి హారం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను అధికారులు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేస్తే దానిని కొట్టివేసిందని న్యాయవాది వివరించారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా ప్రభుత్వాధికారులు పరిహారం చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనల తర్వాత కలెక్టర్ ఇతర అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.