calender_icon.png 23 September, 2024 | 8:10 PM

ప్రిన్సిపాల్ సందీప్ అవినీతి లీలలు

22-09-2024 12:04:47 AM

అక్రమాల పుట్టగా ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యశాల

కోల్‌కత్తా, సెప్టెంబర్ 21: జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన కోల్‌కత్తా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్యశాల అవినీతి పుట్టగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళాశాల పరిధిలో సీబీఐ చేపట్టిన దర్యాప్తులో తాజాగా కీలకమైన విషయాలు బయటకు వెచ్చాయి. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అవినీతి లీల లు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హయా ంలో ఔషధాల కొనుగోళ్లలో అనేక లోపాలను సీబీఐ గుర్తించింది. మెడిసిన్ కొనుగోళ్లలో తీవ్రమైన జాప్యం వహించారని నిర్ధారి ంచింది. సాధారణంగా ప్రభుత్వాసుపత్రులకు మెడిసిన్ సమకూర్చాలంటే టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రిన్సిపాల్ వాటిని లెక్క చేయకుండా కమీషన్ల కక్కుర్తి కోసం తనకు నచ్చిన ఏజెన్సీలను ఎంచుకునే వాడని ఆరోపించింది. ఎన్నో అర్హత లేని ఏజెన్సీల నుంచి తెప్పించారని గుర్తించింది. ప్రిన్సిపాల్ ఆసుపత్రి పరిధిలో అనాథ శవాలను సైతం అక్రమంగా విక్రయించేవాడని ఆరోపణలు ఉన్నాయి