21-04-2025 12:30:39 PM
- ఈనెలాఖరులోనే రిటైర్మెంట్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ప్రధాన ఉపాధ్యాయుడు మృత్యువాత పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) వెల్దండ మండలం శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే అచ్చంపేటకు చెందిన పాపిశెట్టి శ్రీనివాసులు ( 61) తెలకపల్లి మండల కేంద్రంలోనీ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాడు.
ఈ నెల ఆఖరిలో పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ మధ్య పదవీ విరమణ కార్యక్రమాన్ని కూడా పాఠశాలలో జరిపించారు. సోమవారం హైదరాబాద్ నుండి పాఠశాలకు విధుల్లో చేరేందుకు వెళుతుండగా వెల్దండ మండల శివారులో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా స్థానికుల సహాయంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీఈవో రమేష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం హటాహుటీన కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని నివాళులర్పించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.