calender_icon.png 10 January, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్

10-01-2025 01:00:31 AM

రూ.2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్

ఇల్లెందు, జనవరి 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. రూ.2 వేలు లంచం తీసుకుంటూ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణ పట్టుబడ్డారు.

అదే పాఠశాలలో పనిచేసే అవుట్ సోర్సింగ్ టీచర్ సంధ్యారాణి వద్ద రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ బృందం పట్టుకుంది. సంధ్యారాణి జీతం ఇవ్వాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు.

రూ.రెండు వేలకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఏసీబీ ఆశ్రయించిన సంధ్యారాణి.. వారి సూచన మేరకు గురువారం రూ.2 వేలు ఇస్తుండగా ప్రిన్సిపాల్‌ను, అటెండర్‌ను పట్టుకున్నారు.