calender_icon.png 2 January, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నప్ప సర్వస్వం.. చెంచు యువరాణి నెమలి

31-12-2024 01:44:16 AM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన కన్నప్ప టీం.. తాజాగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ వదిలింది.

ఈ సినిమాలో హీరోయిన్ ప్రీతి ముఖుందన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో నెమలి పాత్రలో ప్రీతి నటిస్తోంది.  ‘అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి నెమలి’ అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్‌పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో కన్నప్పగా విష్ణు నటిస్తుం డగా..  మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమా ర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్‌బా బు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ము ఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది.