19-04-2025 12:00:00 AM
కొంకన్నగుట్టపై లభ్యం
బోథ్, ఏప్రిల్ 18: ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఆదిమానవులు నివసించారనడానికి తరచూగా అనేక ఆనవాళ్లు లభ్యమవు తుంటాయి. తాజాగా బోథ్ మండలంలోని దన్నూర్ (బి) గ్రామ సమీపంలోని కొంకన్న గుట్ట అటవీ ప్రాంతంలో ఆదిమానవుల పనిముట్లు లభ్యమయ్యాయి. శుక్రవారం బోథ్ ఎఫ్‌ఆర్వో ప్రణయ్ తన బృందంతో కలిసి అడవిని పరిశీలించే క్రమంలో అవి లభ్యమైనట్లుగా పేర్కొన్నారు. కొంకన్న గుట్ట మధ్య లో సూక్ష్మరాతి మొనదేలిన చాకు లాంటి రాళ్లు లభ్యమయ్యాయి. ఇలాంటివి అనేకం గా ఉన్నట్లు చెప్పారు.
ముఖ్యంగా ఈ ప్రాం తంలో పొచ్చర జలపాతం చుట్టుపక్కల సైతం లక్షల ఏళ్లనాటి ఆదిమానవ సమాజం ఆనవాళ్లు నేటికీ భద్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి ఆనవాళ్లతో చరిత్ర పరిశోధకులు సమాచారం రాబట్టవచ్చన్నా రు. ఈ ప్రాంతంలోని ఆనవాళ్లు ఏ కాలానికి సంబంధించినవి అనే విషయం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్లు చొరవ తీసుకొని పరిశోధన చేయాలని కోరారు.