calender_icon.png 27 December, 2024 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీ

10-07-2024 05:27:02 AM

న్యూఢిల్లీ, జూలై 9: త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు వారితో జూలై 11 గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవుతారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న లోకసభకు బడ్జెట్ సమర్పిస్తారు. ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని జరిపే భేటీలో నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరి, ఇతర సభ్యులు కూడా హాజరవుతారు.

ఇప్పటికే సీతారామన్ ఆర్థిక వేత్తలు, పరిశ్రమ నేతలతో చర్చలు జరిపిన విష యం విదితమే. 2047కల్లా భారత్‌ను ధనికదేశంగా రూపొందించేందుకు తగిన రోడ్ మ్యాప్‌ను బడ్జెట్లో ప్రతిపాదిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంస్కరణలు వేగవంతం చేసేదిశగా బడ్జెట్లో ప్రభుత్వం చరిత్రాత్మక చర్యల్ని చేపడుతుందంటూ గత నెలలో పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసం గంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.