calender_icon.png 3 October, 2024 | 5:55 AM

పాఠశాలను ప్రారంభించిన ప్రధాని

03-10-2024 12:51:10 AM

ఖమ్మం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో నిర్మించిన ఏకలవ్య పాఠశాల ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవా రం వర్చువల్‌గా ప్రారంభించి, పాఠశాల సి బ్బందిని, అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన విద్యార్థుల కోసం రైతులు ముందుకు వచ్చి, పాఠశాల నిర్మాణానికి అవసరమైన భూమిని దానం చేశారని అన్నారు.

అన్ని సౌకర్యాలతో ప్రధానమంత్రి  దీనిని వర్చువల్‌గా ప్రారంభించడం సంతోషంగా ఉంద న్నారు. పాఠశాల కోసం భూమిని దానం చే సిన రైతులకు కరెంట్ బోర్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్  నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కాగా తమను అన్ని విధాలా ఆదుకుంటామని, తమ సమస్యలు పరిష్కరిస్తానంటేనే పాఠశాల నిర్మాణానికి భూమిని దానం చేశామని, తమ సమస్యలను పరిష్కరించాలని పాఠశాల వద్ద పేర్కొంటూ పలువురు రైతులు ధర్నా చేశారు. తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

బద్దుతండాలో 

కొత్తగూడెం, అక్టోబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బద్దుతండా గ్రామంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య (ఈఎంఆర్‌ఎస్) పాఠశాలను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ఆర్సీవో నాగార్జునరావు, ఓఎస్‌డీ హైదరాబాద్ క్రిష్ణారావు, సీపీడబ్ల్యుడి చందర్‌రావు, డీఎస్పీ చంద్రభాను, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో రవీందర్‌రావు, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్ పాల్గొన్నారు.