calender_icon.png 1 April, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నాగ్‌పూర్‌కు ప్రధాని

30-03-2025 12:19:47 AM

ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళి అర్పించనున్న మోదీ..

మహదేవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన..

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం నాగ్‌పూర్‌కు వెళ్లనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులైన కేజీ హెడ్‌గేశ్వర్, ఎం.ఎస్ గోల్వాల్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ స్మృతి మందిరంలో మోదీ నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హెడ్‌గేశ్వర్ ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కాగా.. ఎం.ఎస్ గోల్వాకర్ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండో సారంగ్‌సంచాలక్‌గా సేవలందించారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ హెడ్‌గేశ్వర్ స్మృతి మందిర్‌లో ప్రధాని నివాళి అర్పిస్తారు. 1956లో వేల మంది అనుచరులతో అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన దీక్ష భూమి వద్ద ప్రధాని మోదీ అంబేద్కర్‌కు నివాళి అర్పించనున్నారు. 

మహదేవ్ నేత్రాలయకు శంకుస్థాపన

ఈ పర్యటనలో ప్రధాని మోదీ మహదేవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిలో 250 పడకలు, 14 అవుట్ పేషంట్ డిపార్ట్‌మెంట్లు (ఓపీడీ), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి.