calender_icon.png 6 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకుంభమేళాలో ప్రధాని పుణ్యస్నానం

06-02-2025 01:22:11 AM

* అరైల్ ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి సీఎం యోగితో కలిసి బోటు ప్రయాణం 

* త్రివేణి సంగమం వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు

* కుంభమేళాలో పాల్గొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు ఎక్స్‌లో ట్వీట్

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 5: మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నా రు. భీష్మ అష్టమి పర్వదినం పురస్కరించుకుని బుధవారం 11.30 గంటలకు త్రివేణి సంగమం వద్ద ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు. పుణ్యస్నానం సందర్భంగా రుద్రాక్ష మాలను చేతబూని ప్రధాని ప్రత్యేక ప్రార్థన లు చేశారు. పవిత్రస్నానం ఆచరించిన తర్వాత ప్రధాని తన పూర్వీకులకు తర్పణం సమర్పించారు.

గంగమ్మకు ప్రత్యేక హారతి ఇచ్చారు. మహాకుంభమేళాలో పాల్గొన్న భ క్తులకు ప్రధాని అభివాదం చేశారు. మహాకు ంభమేళాలో పాల్గొనేందుకు మోదీ 10. 05గంటలకు ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అరైల్ ఘాట్‌కు వెళ్లారు. బోటు ద్వారా యూపీ సీఎం యోగితో కలిసి త్రివేణి సంగమానికి చేరుకున్నారు. 

కుంభమేళాలో పాల్గొనడం నా అదృష్టం

ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా జరగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. సంగమంలో జరిగే పుణ్యస్నానాన్ని దైవిక అనుసంధానానికి సంబంధించిన క్షణంగా అభివర్ణించారు. తన హృదయం కూడా భక్తి భావంతో నిండిపోయినట్టు వెల్లడించారు. గంగా మాత దేశ ప్రజలందరికీ శాంతి, మంచి ఆరోగ్యం, సామరస్యాన్ని ప్రసాదింస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని వస్త్రధారణ

ప్రధాని నరేంద్రమోదీ మహాకుంభమేళాకు హాజరైన సందర్భంగా ఏకంగా మూడు రకాల దుస్తులు ధరించారు. లేత గోదుమ రంగు కుర్తా, పైజామాపై నెహ్రూ జాకెట్‌ను ధరించి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న ప్రధాని.. పుణ్యస్నానం సం దర్భంగా కాషాయ రంగులో ఉన్న జాకెట్, నీలం రంగు ట్రాక్ ప్యాంటును ధరించారు. పు ణ్యస్నానం సమయంలో ప్రధాని తన మెడలో రుద్రాక్ష మాలను వేసుకోవడంతోపాటు కుడి చేతికి జపమాలను చుట్టుకున్నారు. పుణ్యస్నానం అనంతరం కుర్తా, చుడీదార్ పైజామా వేసుకుని వాటిపై పఫ్ఫర్ జాకెట్‌ను ధరించారు. దీంతోపాటు రంగురంగుల పహారీ టోపిని ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.