calender_icon.png 19 January, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీట్’పై ప్రధాని మౌనం వీడాలి

05-07-2024 12:12:46 AM

విద్యార్థి, యువజన సంఘాల నేతల డిమాండ్

పేపర్ లీకేజీకి నిరసనగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ, నెట్, సీఎస్ ఐఆర్, నీట్ పీజీ పరీక్షల రద్దు అంశాలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నీట్‌ను తిరిగి నిర్వహించి, ఎన్‌టీఏను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఎన్‌ఎస్ యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, విజేఎస్, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, పీవైఎల్, ఏఐవైఎఫ్, వైజేఎస్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఇచ్చిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ గురువారం హైదరాబాద్‌లో ప్రశాంతంగా జరిగింది. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, విజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, వైజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సలీం తదితరులు మాట్లాడుతూ.. రాజకీయాల గురించి మాట్లాడే మోదీకి నీట్ గురించి మాట్లాడే సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. 

నీట్ పేపర్ లీకేజీ, నెట్, సీఎస్‌ఐఆర్ పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కేసును సీబీఐతో కాకుండా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఆర్‌ఎల్ మూర్తి, వలీఉల్లాఖాద్రీ, జావీద్, అశోక్‌రెడ్డి, గ్యార నరేశ్, మమత, బీ కృష్ణ, ఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.