calender_icon.png 4 February, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ మాటలు కొండంత.. చేతలు రవ్వంత!

04-02-2025 01:19:28 AM

  • వికసిత్ భారత్‌లో తెలంగాణకు చోటు లేదా..?
  • రాష్ర్ట ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివద్ధి విషయంలో మాటలు కొండంత అయితే చేతలు రవ్వంత కూడా లేదని వికసిత్ భారత్ అంటూ గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్న బిజెపి ప్రభుత్వానికి వికసిత్ భారత్ లో తెలంగాణ ప్రాంతం కనిపించడం లేదా అని రాష్ర్ట ఎక్సైజ్ పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు  ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి తగిన నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డిసిసి అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకష్ణ అధ్యక్షతన ధర్నా చేప ట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బడ్జెట్ అంశంపై మాట్లాడా రు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్న కేటాయించారని పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సైతం తగిన ెదాలో బడ్జెట్లో చోటు కల్పించారని అన్నారు.

ప్రజలు కట్టే పన్నులు ఆధారంగా హక్కుగా పొందాల్సిన బడ్జెట్ కేటాయింపు కూడా కల్పించకపో వడం దుర్మార్గమని మండిపడ్డారు. కుంభ మేళ నిర్వహణకు కోట్లలో బడ్జెట్ కేటాయిం చి ప్రజలను నీటిలో ముంచుతూ తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ కేటాయించకుండా ప్రజ లను నిలువునా ముంచారని ఎద్దేవా చేశా రు. ఓట్లు దండుకోవడం కోసం బీహార్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతలు బిజెపితో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం వల్లే బడ్జెట్ విషయంలో నోరు మెదపడం లేదని ఆరోపించారు.

తెలంగాణ ప్రాంత ప్రజలు సుమారు మూడు లక్షల కోట్లు పన్నుల రూపేనా కేంద్రానికి  కడుతుండగా కేంద్రం మాత్రం ఈ ప్రాంతానికి గాడిద గుడ్డు ఇచ్చారని ఆవేదన చెందారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం జాతీయ ెదా కల్పించలేదని తగిన నిధులు కూడా కేటాయించకపోవడాన్ని ఈ ప్రాంత ప్రజల పైన బిజెపి పార్టీకి ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థమైందన్నారు. 

స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ ప్రాంతానికి తగిన నిధులు కేంద్ర ఆర్థిక బడ్జెట్లో కేటాయించాలని ఆయా సంద ర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన తులు సమర్పించినా వాటన్నింటినీ బుట్ట దాఖలు చేయడం దారుణం అన్నారు.

ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేయించుకొని ఎంపీ లుగా చలామణి అవుతున్న వారంతా రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. వారితోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద ర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, తదితర ముఖ్య నేతలు ఉన్నారు. సుమారు గంటకు పైగా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొన్నారు.