నైజీరియా, బ్రెజిల్, గయానాలో పర్యటన
న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లో జరిగే జీ సమ్మిట్ కోసం శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈమేరకు భారత విదేశీ వ్యవ హారాల శాఖ మోదీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిప్రకారం బ్రెజిల్, నైజీరియా, గయానా దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. గతేడాది జీ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఈ ఏడాది బ్రెజిల్‌లో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ జరగ నుంది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలో పర్యటించబోతున్నారు. అలాగే 5 దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని గయానకు వెళ్లడం ఇదే మొదటిసారి. ప్రధాని తన ఐదురోజుల పర్యటనలో మొదటి రెండు రోజులు నైజీరియాలో పర్యటించనున్నారు. తదనంతరం బ్రెజిల్‌లో జరిగే జీ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాతగయానాలో మోదీ పర్యటించనున్నారు.