calender_icon.png 12 March, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం

12-03-2025 12:21:49 AM

  • ప్రకటించిన మారిషస్ ప్రధాని నవీనచంద్ర 

ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీకి గుర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 11: ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్’ను ఆ దేశ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గోలమ్ ప్రకటించారు. మంగళవారం పోర్ట్ లూయిస్‌లో ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి మారిషస్ ప్రధాని పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. ఈ గౌరవం దక్కించుకున్న మొదటి భారత ప్ర ధానిగా మోదీ గుర్తింపు పొందారు. అత్యున్న త పురస్కారం ప్రకటన పట్ల మారిషస్ ప్రధానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. తన పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అవుతాయని మోదీ ఆకాంక్షించారు. బుధవారం జరిగే మారిషస్ 57వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.