న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రధాని మోదీ సోమవారం ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు బయలుదేరారు. రెండు దేశాల పర్యటనల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, రక్షణ సహకారం, వాణిజ్య భాగస్వామ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
పారిస్‌లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి పెద్ద సంఖ్యలో సీఈవోలు హాజరుకానున్నారు. ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. రెండు దేశాలు 2026ను భారత్ ఆవిష్కరణ సంవత్సరంగా ప్రకటించి లోగో ను విడుదల చేయనున్నాయి.
12న అమెరికాకు..
మోదీ ఈనెల 12 నుంచి 14 వరకు అమెరికాలో పర్యటించి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటన “భారత్‌ేొఅమెరికా భాగస్వామ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. పరస్పర ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో కొత్త పరిపాలనను నిమగ్నం చేయడానికి ఇదొక విలువైన అవకాశమన్నారు.