calender_icon.png 4 March, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని లయన్ సఫారీ

04-03-2025 02:04:33 AM

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే పురస్కరించుకుని గిర్ వైల్డ్‌లైఫ్ సాంక్చ్యూరీని సందర్శించిన ప్రధాని

గాంధీనగర్, మార్చి 3: అంతర్జాతీయ వైల్డ్ లైఫ్ డేను పురస్కరించుకొని సోమవారం ప్రధాని మోదీ గుజరాత్‌లోని జనాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన భుజాన కెమెరా వేసుకొని ఫొటోగ్రాఫర్ అవతారమెత్తి.. సాంక్చ్యూరీలో ఉన్న సింహాలను తన కెమెరాలో బంధించారు.

అనంతరం కొన్ని ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఈ ఉద యం వైల్డ్ లైఫ్ డేను పురస్కరించుకుని గిర్‌లో సఫారీకి వెళ్లాను. మనందరికీ తెలిసిన విధంగా ఇది ఆసియాటిక్ సింహాలకు నిలయం’ అని మోదీ ట్వీట్ చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ మధ్యాహ్నం జరిగిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 

ఈ భేటీలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఎన్జీవోలు, వివిధ రాష్ట్రాల సభ్యులు తదిత రులు పాల్గొన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులను ప్రధా ని గుర్తు చేసుకుని వన్యప్రాణి సంరక్షణ కోసం చేసిన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు