calender_icon.png 26 December, 2024 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారాల అభివృద్ధికి ప్రధాని కృషి

07-10-2024 02:23:52 AM

రూ.900 కోట్లతో నంగారా భవన్ 

మాజీ ఎంపీ సీతారాం నాయక్

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బంజారాల గురించి ఏ ప్రధాని కూడా ఆలోచించలేదని, ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం తమ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు.

అంతరించిపోతున్న బంజారాల చరిత్ర, సంస్కృతిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అందుకే వేల ఏళ్ల బంజారాల చరిత్రను ప్రపంచానికి చాటేలా మహారాష్ట్ర, వాశిమ్ జిల్లాలోని పౌరదేవి గ్రామంలో రూ.900 కోట్లతో నంగారా భవన్ నిర్మించారని అన్నారు.

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంజారాల సంస్కృతిని వెలుగులోని తీసుకొచ్చేందుకు బంజారా మ్యూజియంను ప్రధాని ప్రారంభించారని తెలిపారు. మైథిలి, కొంకిణి, కోడ భాషలను 8వ షెడ్యూల్‌లో చేర్చారని, 12 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషని మాత్రం చేర్చలేదన్నారు.

బంజారాల ఆరాధ్యదైవమైన సేవాలాల్  మహరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బాబి నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.