calender_icon.png 14 January, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యా చేరుకొన్న ప్రధాని

09-07-2024 02:30:48 AM

మాస్కోలో ఘన స్వాగతం

అధ్యక్షుడు పుతిన్‌తో విందు

నేడు ద్వైపాక్షిక చర్చలు

న్యూఢిల్లీ, జూలై 8: భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ రష్యా చేరుకొన్నారు. ఆయనకు మాస్కోలో రష్యా అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీకి రష్యా మొదటి డిఫ్యూటీ ప్రధాని డెనిస్ మంటురోవ్ సాదరంగా స్వాగతం పలికారు.  భారత ప్రధాని రష్యా సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. మోదీ గౌరవార్ధం సోమవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విందు ఇచ్చారు. మంగళవారం ఈ ఇద్దరు నేతలు భారత్ రష్యా 22వ సమ్మిట్‌లో చర్చలు జరుపుతారు. మాస్కో చేరుకొన్న వెంటనే మోదీ ట్వీట్ చేశారు. ‘రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. 

మోదీ పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ: రష్యా

మోదీ రష్యా చేరుకోవడానికి ముందే పుతిన్ ప్రెస్ సెక్రటరీ పెస్కోవ్ కీలక వ్యాఖ్య లు చేశారు. మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడనున్నాయని, మోదీ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.  ఇరు దేశాధినేతల మధ్య శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనున్నాయన్నారు.