calender_icon.png 29 March, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక విద్యతోనే భవిష్యత్తుకు పునాది

24-03-2025 09:38:36 PM

టేకులపల్లి (విజయక్రాంతి): ప్రాథమిక స్థాయిలోనే  పిల్లల్లో విద్యాభోధన పునాదిగా మారుతుందని టేకులపల్లి ఎంఈఓ ఎ.జగన్ అన్నారు. సోమవారం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని ఉచితంగా ఇస్తున్నారని, గతంలో కంటే ఎన్నో మార్పులు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యాబోధన జరుగుతుందని, ఈ అవకాశం ద్వారా విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. స్కూల్ హెచ్ఎం ఎం. జ్యోతిరాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్లు జర్పల పద్మ, నీరజ షారోన్, సి ఆర్ పి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.