28-03-2025 05:38:33 PM
అచ్చంపేట సహకార సంఘం చైర్మన్ నర్సింహారెడ్డి
నిజాంసాగర్,(విజయక్రాంతి): రైతుల శ్రేయస్సు తమ లక్ష్యమని అచ్చంపేట సహకార సంఘ చైర్మన్ కయ్యం నరసింహారెడ్డి(Achampeta Cooperative Society Chairman Kayyam Narasimha Reddy) అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అచ్చంపేట మహాజన సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసం తమ సంఘం ఎప్పుడు పాటుపడుతుందని పేర్కొన్నారు. రైతులకు స్వల్పకాలిక, దీర్గకాలిక రుణాలను అందించామని సకాలంలో ఎరువుల సరఫరా చేసి రైతులకు తోడ్పాటు అందించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ గుమస్తా శ్రీనివాస్, డైరెక్టర్లు రాములు, విట్టల్ గౌడ్, సంగయ్య, దాచకిషన్ సహకార సంఘ సీఈఓ సంగమేశ్వర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.