calender_icon.png 10 March, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి

10-03-2025 01:37:40 AM

రాజాపూర్ మార్చి 9 : రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ముదిరెడ్డిపల్లి గ్రామం లోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది ఎస్సు శివానంద్ గౌడ్ తెలిపిన వివరాలు. ఇలా ఉన్నాయి జడ్చర్ల పట్టణ కేంద్రానికి చెందిన సత్యనారాయణ శర్మ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పురోహితుడుగా సేవలందిస్తున్నాడు ఆదివారం ముదిరెడ్డిపల్లి లో లగ్న పూజ వివాహం జరిపించేందుకు జడ్చర్ల నుంచి తన మోటార్ సైకిల్ పై వస్తున్నాడు.

ఈ క్రమంలో ముదిరెడ్డిపల్లి చౌరస్తాలో రహదారి దాటుతున్న క్రమంలో అటు నుంచి మోటార్ సైకిల్ పై వస్తున్న సనాతన రమేష్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఢీకొనడంతో సత్యనారాయణ శర్మకు తలకు కాళ్ల చేతులకు బలమైన రక్త గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు గాయపడిన సత్యనారాయణ శర్మను 108 అంబులెన్స్ లో మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.మృతుని కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సు తెలిపారు.