25-03-2025 12:59:59 AM
జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్
కొత్తపల్లి,మార్చి24(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన కార్యకర్తల అహంకారం తగ్గలేదని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ అన్నారు కరీంనగర్ లోని సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ సభ సందర్భంగా బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ పద్మజ పైకి బైకు దూసుకెళ్లేన సంఘటనలో ఆమెకు గాయపడినన్నారు బి ఆర్ ఎస్ కార్యకర్తలు నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు ఆరోపించారు దీని కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు రోడ్డుపై నిరంతరం డ్యూటీ చేసే పోలీసుల పైకి వాహనాలను తీసుకెళ్లడం అహంకారానికి నిదర్శనం అన్నారు కానిస్టేబుల్ పద్మజా కు పూర్తిస్థాయిలో చికిత్య అందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు