calender_icon.png 17 November, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరలు దడదడ

13-11-2024 12:00:00 AM

  1. 14 నెలల గరిష్ఠస్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం
  2. 6.21 శాతానికి పెరుగుదల
  3. 42 శాతం ఎగిసిన కూరగాయల ధరలు

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఆహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగినందున అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించిపోయింది. జాతీయ గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌వో) మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో వినిమయ ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విశ్లేషకుల అంచనాల్ని మించి 6.21 శాతానికి చేరింది. ఇంతటి గరిష్ఠస్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకా వడం గత 14 నెలల్లో ఇదే ప్రధమం.  అ ఏడాది  2024 ఆగస్టులో 3.65 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.49 స్థాయికి ఎగిసింది. వెనువెంటనే అక్టోబర్‌లో 6 శాతాన్ని మించిపోయింది  2023 ఆగస్టు తర్వాత ఇదే గరిష్ఠస్థాయి. 

ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10.87 శాతం

ఆహారోత్పత్తుల ధరలే  రిటైల్ దవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. నిరుడు అక్టోబర్‌తో పోలిస్తే 2024 అక్టోబర్‌లో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10.87 శాతం పెరిగినట్లు ఎన్‌ఎస్‌వో తాజా గణాంకాల వెల్లడిస్తున్నాయి. గత అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 6.61 శాతంకాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 9.24 శాతం. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, వంటనూనెల ధరలు పెరిగినందునే ఈ అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎగిసిందని ఎన్‌ఎస్‌వో తెలిపింది. ముఖ్యంగా కూరగాయల ధరలైతే 42.18 శాతం పెరిగాయి. అయితే ఆహార్పోత్తుల్లో పప్పు దినుసులు, గ్రుడ్లు, చక్కెర, మసాలా దినుసుల ద్రవ్యోల్బణం తగ్గిందని ఎన్‌ఎస్‌వో వెల్లడించింది  గ్రామాల్లో ఎక్కువ

రిటైల్ ద్రవ్యోల్బణం పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే అధికంగా ఉన్నది. అక్టోబర్ నెలకు గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.68 శాతంకాగా, పట్టణాల్లో ఇది 5.62 శాతమని ఎన్‌ఎస్‌వో తెలిపింది.

వడ్డీ రేట్ల కోత లేనట్టే

రిజర్వ్‌బ్యాంక్ సహనస్థాయి అయిన 6 శాతాన్ని మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడంతో ఈ ఏడాది ఇక కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించదని విశ్లేషకులు చెప్పా రు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంలోపు కట్టడి చేయాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశించింది. గత కొద్ది నెలలుగా ఆ శ్రేణి మధ్యలోనే ద్రవ్యో ల్బణం నమోదవుతున్న కారణంగా గత సమీక్షలోనే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.

కానీ రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుందని భా వించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రేట్ల కోతకు నో చెప్పింది. తాజాగా ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించినందున, డిసెంబర్ సమీక్షలోనూ రేట్ల తగ్గింపు ఉండదని విశ్లే షకులు చెపుతున్నారు. వచ్చే ఫిబ్రవరి వరకూ ఆర్బీఐ రేట్ల కోత ఉండ దంటూ కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పేర్కొన్న విషయం తెలిసిందే.