calender_icon.png 14 March, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా...

14-03-2025 06:09:30 PM

మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తుంటే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ మునుగోడు మండల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. శుక్రవారం గులాబీ శ్రేణులు  ఆధ్వర్యంలో మునుగోడు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, దానిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఆయనను అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటని అన్నారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. భారత రాజ్యాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మందుల సత్యం, పగిళ్ల సతీశ్‌, ఈద శరత్ బాబు, మారగోని అంజయ్య, మేకల శ్రీనివాస్ రెడ్డి, మాదనబోయిన పరమేష్ యాదవ్, బోయ లింగస్వామి, యడవల్లి సురేష్, దోటి కరుణాకర్, అయితగోని విజయ్, ఐతరాజు పర్వతాలు, సింగం సైదులు, బండారు శ్రీనివాస్, జంగిలి సాంబయ్య, దుబ్బ రాజశేఖర్, జీడిమెట్ల జలంధర్, పందుల రాజేష్, దొమ్మటి శ్రీను, సురిగి రవి, నందిపాటి వెంకన్న, దండు మహేష్, యాదగిరి, వెంకన్న, ఐయితరాజు వెంకన్న, ముఖ్య నాయకులు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.