calender_icon.png 12 March, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్​ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు

12-03-2025 04:57:06 PM

జనగామ,(విజయక్రాంతి): వేసవిలో గృహ వినియోగదారులకు ఎలాంటి విద్యుత్​ అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఏడీఈ వేణుగోపాల్​, టౌన్​ 2 ఏఈ చంద్రమోహన్​ తెలిపారు. సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​లో భాగంగా మంగళవారం డీఈ లక్ష్మీనారాయణ(DE Lakshminarayana) ఆధ్వర్యంలో జనగామ టౌన్​ 2 పరిధిలో 160 కేవీఏ సామర్థం గల మూడు ట్రాన్స్​ఫార్మర్లు, 100 సామర్థ్యం గల మరో రెండు ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో కరెంటు కోతలు లేకుండా, ఉన్న ట్రాన్స్​ఫార్మర్లపై అధికార భారం పడకుండా అదనపు ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్​ సిబ్బంది పాల్గొన్నారు.