నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనీస జాగ్రత్తలను పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికార శివాజీ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదాల నివారణపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కార్యాలయంలో విద్యుత్ వైర్లు పరిశీలించాలని సేఫ్టీ మేనేజ్మెంట్ ఉపయోగించుకోవాలని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్, కార్యాలయ సిబ్బంది మహేందర్, ముర్తుజాఖాన్ సిబ్బంది ఉన్నారు.