జస్టీస్ ఏకే పట్నాయక్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): వివేకంతోనే సాంకేతికత ద్వారా సంభవించే అనర్థాలను నివారించగలమని క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్ ఏకే పట్నాయక్ అన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా వర్సిటీలో శనివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. విచక్షణతో ప్రతిఒక్కరూ సాంకేతికతను వినియోగించాలని సూచించా రు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ అవార్డులు అందజేశారు. తర్వాత మంత్రి నల్సార్ యూనివర్సిటీ తెలుగులో రూపొందించిన నాలుగు నెలల ప్రాథమిక ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించారు. అనంతరం ‘ది ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్‌స్టిస్ట్యూషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నల్సార్ యూనివ ర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జస్టీస్ అలోక్ ఆరాధే, ఫౌండేషన్ న్యూ ఢిల్లీ సెక్రటరీ జనరల్ డాక్టర్ వినోద్ సేథీ పాల్గొన్నారు.