calender_icon.png 11 February, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహజ సిద్ద పద్ధతులతో చీడ, పీడల నివారణ

11-02-2025 07:22:27 PM

నడిగూడెం (విజయక్రాంతి): సహజ సిద్ద పద్ధతులతో చీడ పీడలను నివారించవచ్చని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య (గోపి) స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీరంగాపురం, చాకిరాల, రత్నవరం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో భాగంగా ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రస్తుత రబీ సీజన్ లో సాగులో ఉన్న వరి పంటలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణపై సహజ సిద్ద పద్ధతులను రైతులకు వివరించారు.

నేల ఆరోగ్యం కోసం రసాయన ఎరువులు వాడకుండా జీవామృతం, ఘన జీవామృతం తదితర వాటిని వాడాలని తెలిపారు. చీడ పీడల నివారణకు నీమాస్త్రం, వేప గింజల ద్రావణం, వావిలాకు ద్రావణం, ఆవు మూత్రం పేడ ద్రావణాలు పంటపై పిచికారీ చేసి నివారించవచన్నారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం అని పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.