నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. బుధవారం డిపోలో డ్రైవర్లకు రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్లు సమయపాలన పాటించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈనెల 31 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజశేఖర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.