హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): నాణ్యమైన విద్యుత్ వినియోగం ద్వారానే విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి సీహెచ్ రామాంజనేయులు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల 11వ మహాసభ శనివారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా 2025 నూతన డైరీ, క్యాలండర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల యూనియన్ అధ్యక్షులు జేసీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ తనిఖీ ప్రధాన అధికారి సీహెచ్ రామాంజనేయులు, లైసెన్సింగ్ బోర్డు మెంబర్ బెనర్జీ నేత, మాజీ బోర్డు మెంబర్ నక్కా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.