దేశవ్యాప్తంగా ప్రతికూల మార్పుల కారణంగా అనేక మంది పలు రకాల సీజనల్ వ్యాధుల బారిన పడుతుండటం బాధాకరం. ముఖ్యంగా సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులకు ఆలవాలమైన తెలంగాణ వంటి రాష్ట్రాలలో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు అస్వస్థతకు లోనవుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలు, ఒళ్లు నొప్పులు, డెంగ్యూ, చికున్‌గున్యా, కలరా వంటి సంక్రమిత వ్యాధులు ప్రబల కుండా ప్రభుత్వాధికారులు ఏమీ చేయలేరా? అవికూడా వారాల తరబడి కొనసాగుతూ పీల్చి పిప్పి చేస్తున్నాయి. రెండు, మూడు డోసుల ఔషధాలకు తగ్గే వ్యాధులు ఈమధ్య మరీ మొండికేస్తు న్నాయి.ప్రజలు కూడా తమ పరిధిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
-డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్