నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఇసుక నిల్వలు తరిగిపోకుండా అక్రమాలను వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి అక్రమ ఇసుక నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వ వనరుల నుంచి ఇసుక దోపిడీ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రాంతాల్లో అధికారులు దాడి చేసి ఇసుకలు నియంత్రించి ఇసుక నిలువలను కైవాసం చేసుకోవాలన్నారు. ఇసుక ఉన్న ప్రదేశాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవీందర్, డిపిఓ శ్రీనివాస్, ఆర్డీవోలు రత్నా కళ్యాణి, కోమల్ రెడ్డి పాల్గొన్నారు.