calender_icon.png 3 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడిని నివారించండి

01-04-2025 02:28:45 AM

టీఏజీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

ముషీరాబాద్, మార్చి 31: (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు  పెరుగుతున్న సందర్భంలో మార్చి నెల నుండి మంచి నీటి కోసం ఏజెన్సీ ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని వెంటనే ఏజెన్సీ ప్రాంతంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనీ  టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మీడి యం బాబురావు డిమాండ్ చేశారు.

ఈ  మేరకు సోమవారం ముషీరాబాద్ లో  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ప్రారం నికి ముందే ఏజెన్సీలో నీటిమట్టం తీవ్రంగా పడిపోవడం, త్రాగునీటి కోసం ఆదివాసీలు కిలోమీటర్ల దూరంలో బావులు, చెలిమేలా నీటి కోసం గంటల కొద్దీ పడి గాపులు కాయాల్సిన దుస్థితి ఏజెన్సీలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆదివాసీలకు కేటాయింపులు పెంచినట్టు చూపిన గత కేటా యింపులు ఖర్చులు చూసినప్పుడు తీవ్ర వ్యత్యాసం ఉందని, కేటాయించిన బడ్జెట్ లో అనేక డిపార్ట్మెంట్‌లకు అభివృద్ధి పేరుతో నిధుల మల్లింపు చేస్తుందని విమర్శించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ ఉపాధ్యక్షులు కారం పుల్లయ్య, బండారు రవికుమార్, శ్రీనివాస్, కమిటీ సభ్యులు మాలశ్రీ తదితరులు పాల్గొన్నారు.