సీఐటీయూ కార్యదర్శి నూర్జహన్
నిజామాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): దేశంలో మహిళలు, పిల్లలపై జరు గుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి నూర్జహన్ ప్రధానికి సోమవారం లేఖ రాశారు. లేఖను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అందజేశారు. పనిచేసే ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతుందన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు తప్పకుండా శిక్షపడేలా చర్య లు తీసుకోవాలని కోరారు. ఆమెవెంట స్వర్ణ, సునిత, రేణుక, సుమలత, పుష్ప, సరిత, సరస్వతి ఉన్నారు.