ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టంను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. రెవెన్యూ పరిపాలనను క్రమబద్ధీకరించడంతోపాటు జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సమగ్ర భూసంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ విజన్ అని తెలిపారు.
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టంపై మంగళవారం సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకుతీసుకెళ్లేందుకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.