02-04-2025 12:00:00 AM
ఖమ్మం, ఏప్రిల్ 1(విజయక్రాంతి):-తెలంగాణా ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పోషక విలువలున్న సన్న బియ్యం పధకాన్ని ఖమ్మం జిల్లాలో మంగళవారం ఘనంగా ప్రారం భించారు.జిల్లాలోని 748 చౌక దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ లోని చర్చి కాంపౌండ్ లో మేయర్ పునుకొల్లు నీరజ కార్యక్రమాన్ని ఆరంభించారు.
పెనుబల్లి మండలం ముత్తగూడెం లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పధకాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పధకాన్ని ప్రారంభించారు.
జిల్లాలోని ఏ రేషన్ షా పు నుంచైనా పోర్టబులిటీ ద్వారా సన్న బియ్యం పొందవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 51312 మంది రైతుల నుంచి 2,95,608 మెట్రిక్ సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు.
కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభు త్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పథకం మంగళవారం నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండా, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, నేలకొండపల్లి మండలం మంగాపురం తండా గ్రామాల్లో జరిగిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఉ ద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు , భూక్యా సురేష్ తదితరులు పాల్గొన్నారు.