17-04-2025 09:48:06 AM
మూడు రోజులు పండుగ వాతావరణం
మొక్కులు తీర్చుకున్న భక్తులు
చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్(MPDO Office) ఎదురుగా చిన్న ఇంద్ర కీలాద్రిలో ఘనంగా శ్రీ కనక దుర్గా దేవి ప్రతిష్టమహోత్సవం కన్నుల పండగ సాగుతోంది. నాలుగు ఉప ఆలయాలలో విగ్రహ దాతల తో ప్రతిష్టా కార్యక్రమం రాజమండ్రి అర్చకులు తో వైభవంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా హోమములు, పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం రౌతు నర్సింహారావు చేతులు మీద నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్, మండలోజు వీరచారి,కేసంశెట్టి రవి,అర్చకులు దుర్గా ప్రసాద్ భవాని, తంగెళ్ళపల్లి శంకరా చారి, సమ్మయ్య, నాగరాజు ప్రకాష్, మహిళా శక్తి తో కలిసి ప్రతిష్టాకార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది అని సంతోషం వ్వక్తపరచారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని చిన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మండలోజు వీరాచారీ మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతిష్టా కార్యక్రమానికి అమ్మవారికి తంగెళ్ళపల్లి శంకరాచారి, దేవిక దంపతులు మంగళ సూత్రాలు సమర్పించారు. కనక దుర్గ అమ్మవారికి సూత్రాలు సమర్పించడం ఎంతో భాగ్యం అని వారు భావించడం జరిగింది. . ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు , భక్తులకు పేరుపేరునా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,