23-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 22: (విజయక్రాంతి): తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కొరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాం డ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందేలా భవిష్యత్ కార్యాచరణ కోసం శనివారం కాచిగూడలోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన మీడి యా సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ లో స్థానిక సంస్థల్లో బి.సి.లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది బీసీల సమష్టి పోరాట కృషి ఫలితం అని అన్నారు.. అలాగే ఈ బిసి బిల్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీనిని షెడ్యూల్ 9 లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కాకుండా ఉంటుం దన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూర్చొని కేంద్ర ప్రభు త్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు అక్కడి నుండే తెలంగాణ పరిపాలన మొదలు పెట్టాలని అన్నారు.
దీనికి ఉదాహరణగా జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ పార్టీల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశవ్యాప్తంగా సమగ్ర కలగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ ముదిరాజ్, కోలా జనార్ధన్, జెల్ల నరేందర్, రామ్ కోటి, అనంతయ్య, రాజేందర్, భాగ్యలక్ష్మి, జిల్లపల్లి కిరణ్, రఘుపతి, నిఖిల్, బాలయ్య తదిత రులు పాల్గొన్నారు.