calender_icon.png 23 October, 2024 | 4:56 AM

ఒత్తిడి మంచిదే గురూ

31-08-2024 12:00:00 AM

ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫీసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదకరం. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే యూస్ట్రెస్ అని అంటారు. మన భాషలో చెప్పాలంటే ‘మంచి ఒత్తిడి’ అని అర్థం. 

సైకాలజీస్టుల ప్రకారం.. ఇది ఒకరకమైన ఒత్తిడి. అనూహ్యమైన ఘటనలు, ప్రమాదాలు వంటివి శరీరంలో రసాయన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. ఇదే మంచి ఒత్తిడికి కారణం. ఈ మంచి ఒత్తిడి లేకపోతే హాయిగా జీవించడం కష్టమవుతుంది. ఉత్సహంగా, ఆనందంగా ఉన్నప్పుడు సహజంగా పల్స్ రేటు పెరుగుతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. 

  1. * మంచి ఒత్తిడి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదాహరణకు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. 
  2. * ఆఫీసులో కొత్త ప్రాజెక్టును పొందారనుకోండి. మంచి ఒత్తిడి దాన్ని సాధించడానికి బలాన్ని సమకూరుస్తుంది. నైపుణ్యాలను వాడుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది. 
  3. * తలకు మించిన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు పని భారం పెరిగినప్పుడు, తోటి ఉద్యోగులు సహకరించనప్పుడు ఏర్పాడే ఒత్తిడి మాత్రం వేరు. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
  4. * సహజంగానే నేర్చుకునే గుణం ఉన్నప్పటికీ కొత్త విషయాలు అభ్యసించటం, నైపుణ్యం సాధించటం అంత తేలిక కాదు. చిన్న చిన్న విజయాలను సాధిస్తూ వస్తుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వాటి నుంచి స్ఫూర్తి పొందుతూ మెరుగు పరచుకోవటానికి దోహదపడుతాయి. మంచి ఒత్తిడి ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తుంది.