calender_icon.png 11 January, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ కళాశాలలో ప్రెషర్స్ డే

11-01-2025 12:44:45 AM

మహబూబ్ నగర్, జనవరి 10 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పి.జి అటానమస్ కళాశాలలోని పి.జి. కోర్సులైన జువాలజి, కెమిస్ట్రీ , తెలుగు లలో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థినిలకు ఘన స్వాగతం పలుకుతూ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రెషర్స్ డే కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.. ఆట పాటలతో పి.జి విద్యార్థులు అలరించారు.

ఈ కార్య క్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. వి. రాజేంద్ర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఉన్నత లక్షలతో విద్యనిభ్యసించి మీరు చేరుకోవాలనుకున్న స్థాయికి కచ్చితంగా చేరేలా శ్రమించాలని సూచించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను  అందిపుచ్చుకొని భవిష్యత్ లో స్థిరపడాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పి.జి. కో-ఆర్డినేటర్ డాక్టర్.యం. ప్రవీణ్ కుమార్, తెలుగు విభాగాధిపతి డాక్టర్. ఎన్. లక్ష్మీ నరసింహ్మారావు, కెమిస్ట్రీ  విభాగాధిపతి అనిత, అధ్యాపకులైన డాక్టర్. హరిబాబు, శ్రీలత, నసీమ్ భాను, అదిబాతాజ్, ప్రభాకర్, విద్యార్థినిలు పాల్గొన్నారు.