calender_icon.png 15 November, 2024 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం ఉత్పత్తిలో హరియాణా, పంజాబ్‌ను అధిగమించాం

15-11-2024 12:43:52 PM

సంక్రాంతి నుంచి ప్రజలకు సన్నబియ్యం

హైదరాబాద్: తెలంగాణలో గతంలో కోటి 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేది.. ప్రస్తుతం కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించామని చెప్పారు. సన్న ధాన్యానికి బోనస్ ప్రకటించడం వల్ల ఉత్పత్తి పెరిగిందని వివరించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు సన్నబియ్యం ఇవ్వలని సంకల్పించామని మంత్రి స్పష్టం చేశారు.

ధాన్యం ఉత్పిత్తిలో హరియాణా, పంజాబ్ ను అధిగమించామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సన్న ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లు పోటీపడి కొంటున్నారు.. గతంలో 4500 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు జరిగేవన్న మంత్రి తుమ్మల ప్రస్తుతం 7411 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతిపక్షంలోని ప్రబుద్ధులు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.