03-03-2025 12:16:10 AM
చిట్యాల, మార్చి 2 (విజయక్రాంతి): ఇటీవలే నూతనంగా ఎన్నికైన చిట్యాల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆదివారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాద పూర్వకంగా కలిసారు.భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో నూతన అధ్యక్షుడు కాట్రైవుల ఐలయ్య,ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్ లను ఎమ్మెల్యే శాలువాతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.జర్నలిస్టుల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకపోగా సానుకూలంగా స్పందించారు..
నాణ్యమైన వార్తలను అందిచాలని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రామచంద్రమూర్తి, పుల్ల రవి తేజ, బోళ్ల రాజేందర్, కట్కూరి శ్రీనివాస్, శృంగారపు రంగాచారి,వెల్దండి సత్యనారాయణ, గుర్రపు రాజమొగిలి, బుర్ర రమేష్ గౌడ్, సరిగొమ్ముల రాజేందర, సంపత్ కుమార్ పాల్గొన్నారు.