calender_icon.png 17 April, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

08-04-2025 10:58:29 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని పట్టణంలోని సింగరేణి ఠాగూర్ క్రీడా మైదానం ఆవరణంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎరుకల బుచ్చి బాబు, కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా వేల్పుల కిరణ్, ఉపాధ్యక్షుడిగా ఎర్రవెల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మారేపల్లి సాయి కుమార్, కమిటీ సభ్యులుగా పిల్లి రవికిరణ్, డోలకల సంతోష్ కుమార్, గంజి సతీష్, బద్రి సంతోష్ కుమార్ లను ఎన్నుకున్నారు. గత రెండేళ్లుగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీగా సేవలందించిన పిల్లి రవి కిరణ్ ని క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించారు.