calender_icon.png 20 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి

20-04-2025 12:00:00 AM

పీహెచ్ పీ, భజరంగ్ దళ్ నాయకుల డిమాండ్ 

దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన

ఎల్బీనగర్, ఏప్రిల్ 19 : దేశంలో హిందువులకు రక్షణ లేదని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులను కాపాడాలని పీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువుల పై దాడులు చేసి చంపడం దారుణమని, కేంద్ర ప్రభు త్వం వెంటనే పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, వివేకానంద జిల్లా అధ్యక్షుడు పురుషోత్తమ్ రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో హిందువులపై దాదులను  ఖండిస్తూ  శనివారం దిల్ సుఖ్ నగర్ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది  వీహెచ్‌పీ, భజరంగ్ దళ్  కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు  మాట్లాడు తూ.... వక్ఫ్ బోర్డు నవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరూ ముష్కర మూకలు హిందు వులపై దాడులు చేసి చంపారని, ఆస్తులను ధ్వంసం చేసి లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతకే ఆటంకంగా మారిందని వాపోయారు. కార్యక్రమం లో గడ్డిఅన్నారం, సరూర్ నగర్ కార్పొరేటర్లు  ప్రేమ్ మాహేశ్వర్ రెడ్డి, శ్రీవాణి, పీహెచ్‌పీ తదితరులు పాల్గొన్నారు.