calender_icon.png 14 October, 2024 | 2:53 PM

జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

14-10-2024 12:23:19 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. పదేండ్ల తర్వాత జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ క్రేంద్రం నిర్ణయం తీసుకుంది. 2018లో జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రబుత్వం కుప్పకూలింది.

దీంతో శాసన సభను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం గవర్నర్, రాష్ట్రపతి పాలనను  విధించింది.  2019లో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. దీంతో రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగు విభజించడంతో భద్రతాపరమైన కారణాలు ఏర్పాడాయి. దీంతో అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. 2019 అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.