calender_icon.png 14 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

14-02-2025 01:50:20 AM

ఇంఫాల్, ఫిబ్రవరి 13: కొద్ది రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ రాజీనామా చేసి మూడు రోజుల తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం గమనార్హం. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా అజయ్ భల్లా ఉన్నారు. ప్రతిపక్షాలు సీఎం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. 

కాల్పుల కలకలం

మణిపూర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో కా ల్పులు కలకలం రేపాయి. గురువారం ఇం ఫాల్‌లోని లామ్‌సంగ్ ఏరియా సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో సంజయ్ కుమార్ అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు తోటి జవాన్లు మృతి చె ందగా.. మరో 8 మంది గాయపడ్డారు. జ వాన్ వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు ధృవీకరించారు.