21 వరకు శీతాకాల విడిది
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతాకాల విడిది కోసం 16న హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 21 వరకు ఆమె హైదరాబాద్‌లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఉండనున్నారు. తెలంగాణలో శీతాకాల విడిది ముగిసిన తర్వాత ఏపీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.