- స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్
- నేటి ‘లోక్ మంథన్’లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
హైదరాబాద్, నవంబర్ 21 ( విజయక్రాంతి): రెండురోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. శిల్పాకళా వేదికలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి శుక్రవారం పాల్గొననున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతోపాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.