calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి..

19-04-2025 08:48:25 PM

వి.హెచ్.పి ఆధ్వర్యంలో నిరసన...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం సాకుతో అల్లర్లను సృష్టిస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బొండ్ల నారాయణ అన్నారు. బెంగాల్ లో  హిందువులపై దాడి చేసి, ముగ్గురిని చంపినా వారిని శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు అలోక్ కూమార్ పిలుపు మేరకు ఆదిలాబాద్ లో వి.హెచ్.పి నేతలు నిరసన వ్యక్తం చేశారు.

బెంగాల్ లో మమత బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలనా విధించాలని డిమాండ్ చేస్తూ శనివారం బైక్ ర్యాలీ లో నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా సాగిన బైకు ర్యాలీ కలెక్టరేట్ కు చేరుకుంది. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామల దేవి కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ అధ్యక్షుడు బండారి సంతోష్, నాయకులు రామేశ్వర్, కార్తీ, కేంద్రే విజేయ్, దుర్గా వాహిని, రేఖ, రజిని, శారద, వినయ్, తదితరులు ఉన్నారు.